🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2025, 9:52 am Posted by : DAINAMIC NEWS

పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను

News Image

డైనమిక్, నల్గొండజిల్లా,నవంబర్ 5




నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మిత్రులు, అభిమానులు, కేవీపీఎస్ నాయకులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.కార్యక్రమం ప్రారంభంలో కొండేటి శ్రీనుకు పూలమాలలతో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన కేక్ కట్ చేసి అందరి శుభాకాంక్షలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మిత్రులు, అభిమానులు ఆయన ప్రజాసేవా తపన, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు ఇచ్చే ప్రోత్సాహం గురించి ప్రస్తావించారు. జిల్లా స్థాయిలో కేవీపీఎస్ కార్యకలాపాలకు శ్రీను చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.




ఈ సందర్భంగా కొండేటి శ్రీను మాట్లాడుతూ




— “ఇలాంటి స్నేహితులు, మిత్రులు, అభిమానులు నా వెంటే ఉండటం నాకు గర్వంగా ఉంది. ప్రజలకు సేవ చేయడం, విద్యార్థులు మరియు యువత అభివృద్ధికి కృషి చేయడం నా జీవిత లక్ష్యం” అని తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్న మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పూల గుచ్ఛాలు అందజేశారు. వేడుకల్లో పాల్గొన్న వారిలో స్థానిక నాయకులు, సామాజిక సేవకులు, కేవీపీఎస్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

🏠 Home