🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 November 2025, 8:30 am Posted by : DAINAMIC NEWS

మిర్యాలగూడలో రేపు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డీ లు రెండు శాఖల మంత్రుల భారీ పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

News Image

డైనమిక్న్యూస్– నల్గొండ బ్యూరో, నవంబర్ 16




మిర్యాలగూడ పట్టణంలో రేపు (సోమవారం) పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాలు, చిత్రపట శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లోపాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.




ఉదయం 9.50 నుంచి 12.15 వరకు పర్యటన




మంత్రులు ముందుగా శెట్టిపాలెం–అవంతిపురం మార్గంలో 74 కోట్ల రూపాయలతో పూర్తిచేసిన రహదారిని ప్రారంభిస్తారు. అనంతరం 15 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారిని, 16 కోట్ల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రహదారులు, మురికి కాలువలను ప్రారంభించనున్నారు.




పట్టణంలో సౌకర్యాల విస్తరణ




మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 41 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బ్లాక్‌టాప్, సిమెంట్ రహదారి పనులు, మిర్యాలగూడ –తడకమళ్ళ రహదారిని 15 కోట్ల రూపాయలతో ఆరు మార్గాలుగా విస్తరించే పనుల్లో మంత్రులు పాల్గొంటారు.ఫ్లైఓవర్ ప్రాంతం, మున్సిపాలయ ఆవరణ సుందరీకరణకు 3 కోట్ల రూపాయలు కేటాయించబడినట్లు అధికారులు తెలిపారు.




పైవంతెన పరిశీలన – విద్యాసంస్థల ప్రారంభాలు




నంది పాత్ర బైపాస్ వద్ద నిర్మాణంలో ఉన్న పైవంతెన పనులను ఇద్దరు మంత్రులు ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. తరువాత 5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాల భవనంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు.ప్రధాన బజార్‌లో చావడి వెండి ప్రాంగణ ప్రారంభం కూడా కార్యక్రమాల్లో భాగం.




అన్నదానంలో పాల్గొనే మంత్రులు




పర్యటనలో భాగంగా మంత్రులు అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించి స్వామీజీలతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు.




హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం




అన్ని కార్యక్రమాలు ముగిసిన అనంతరం మంత్రులు మధ్యాహ్నం 12.30 గంటలకు మిర్యాలగూడ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారని కలెక్టర్ వివరించారు.





🏠 Home