🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 November 2025, 11:43 am Posted by : DAINAMIC NEWS

పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ..!ప్రపంచాన్ని ఆకట్టుకున్న సీఐఐ సమ్మిట్ – 2025మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

News Image

డైనమిక్ న్యూస్, మాచర్ల,నవంబర్16




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు నిజమైన స్వర్గధామ మవుతుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్–2025 దేశ–విదేశీయుల దృష్టిని ఆకర్షించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని ఆయన అన్నారు.




ఒక్క సమ్మిట్‌తో లక్షల కోట్లు – వరదలా పెట్టుబడులు




సమ్మిట్ ప్రభావంతో రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ వైపు వరదలా వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విజయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం చేసిన కృషే ప్రధాన కారణమని ఆయన చెప్పారు.




మూడు ప్రాంతాలకు సమాన న్యాయం – పెట్టుబడులకు కొత్త దారి




ఏపీ మూడు ప్రాంతాలకు సమానంగా పరిశ్రమల పెట్టుబడులు రావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని ఆయన తెలిపారు. వివిధ కంపెనీలను అన్ని జిల్లాల వైపు మళ్లించడంలో ప్రభుత్వం చూపిన నిబద్ధతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా గుర్తించారు.




13 లక్షల కోట్లు – 16 లక్షల ఉద్యోగాలు: చరిత్రాత్మక సాధన




ఈ సదస్సుతో రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించడం చరిత్రలో నిలిచిపోయే ఘనత అని బ్రహ్మానందరెడ్డి అభివర్ణించారు.




బిజినెస్‌కు అనుకూల వాతావరణం – పరిశ్రమలకు ఏపీ ప్రథమ ఎంపిక




‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం రూపొందించిన అనుకూల విధానాలు పరిశ్రమలను రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రోత్సహించాయని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని కీలక శాఖల నుండి ఒప్పందాలు ఒకేసారి కుదరడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పారు.




రాష్ట్ర అభివృద్ధికి నాయకత్వం చేస్తున్న సీఎం–డెప్యూటీ సీఎం–మంత్రి లోకేష్‌లకు కృతజ్ఞతలు




రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ–ఉపాధి అవకాశాల పెంపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.






🏠 Home