🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2025, 1:56 am Posted by : DAINAMIC NEWS

చలిలో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం : సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ

News Image

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 17




శీతాకాలం ప్రభావంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రహదారులపై ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుని ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. ఈ సందర్భంలో వాహనదారులు తప్పనిసరిగా రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.




ఎస్పీ నరసింహ మాట్లాడుతూ




పొగమంచు—ప్రమాదాలకు కారణం,ఉదయం సమయంలో మంచు, పొగమంచు కురవడంతో విజిబిలిటీ తగ్గి, ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశముందని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి ఈ కాలంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.




వాహనదారులు పాటించాల్సిన కీలక సూచనలు




వాహనదారులు లైటింగ్ కండిషన్ చెక్ చేసుకోవడం, తక్కువ వేగంతో ప్రయాణించడం, ఓవర్‌టేకింగ్ నివారించడం, ఒకే లైన్‌లో ప్రయాణించడం, వాహనాల మధ్య దూరం పాటించడం వంటి అంశాలను ఎస్పీ వివరించారు.రోడ్డు పరిస్థితులను గమనిస్తూ, ఇతర వాహనదారులకూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా నడపాలని సూచించారు.




ద్విచక్ర వాహనదారుల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు




హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి,హై-బీమ్ వాడకండి — లో-బీమ్ మాత్రమే ఉపయోగించాలి,ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి,రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడాలి,సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్తపడాలి,రోడ్డు తడి వల్ల స్కిడ్ అవుతుందనే ప్రమాదం ఉంది,మలుపు ముందు ఇండికేటర్ తప్పనిసరిగా ఇవ్వాలి,రాత్రి/తెల్లవారుజామున ప్రయాణం నివారించాలి ఈ సమయాల్లో పొగమంచు ఎక్కువ,గ్లౌవ్స్ ధరిస్తే వాహన నియంత్రణ మెరుగుపడుతుంది. కార్లు, భారీ వాహనాల డ్రైవర్లు పాటించాల్సిన సూచనలు,ఫాగ్ ల్యాంప్స్ లేదా లో-బీమ్ లైట్లు మాత్రమే వాడాలి,నెమ్మదిగా, నియంత్రిత వేగంతో డ్రైవ్ చేయాలి,ముందున్న వాహనానికి 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి,డిఫాగర్ లేదా విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ తగ్గించాలి,విజి బిలిటీ తక్కువగా ఉన్నప్పుడు హాజర్డ్ లైట్లు వాడాలి,పొగమంచు, కర్వ్ ప్రాంతాల్లో ఓవర్‌ టేక్ చేయడం పూర్తిగా నివారించాలి.లైన్ మార్కింగ్‌ లు, రోడ్ రిఫ్లెక్ట ర్లను గమనిస్తూ నడపాలి.వైపర్స్, లైట్లు, బ్రేకులు ముందుగానే చెక్ చేసుకోవాలి.సడన్ బ్రేకులు లేదా హఠాత్ మలుపులు తీసుకోవద్దు అని సూచించారు




“సురక్షిత ప్రయాణమే గమ్యం” — ఎస్పీ నరసింహ ప్రజలకు విజ్ఞప్తి




ఎక్కడికైనా వెళ్లేందుకు ముందుగానే ప్రయాణం ప్రారంభించాలని, తొందర పడవద్దని, హెడ్లైట్లు శుభ్రంగా ఉంచాలని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. విజి బిలిటీ అత్యల్పంగా ఉన్నప్పుడు సురక్షిత ప్రదేశంలో ఆగి మంచు తగ్గే వరకు వేచి ఉండాలని అన్నారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ప్రతి వాహన దారుడు ఈ సూచనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ నరసింహ తెలిపారు.






🏠 Home