🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 November 2025, 6:02 pm Posted by : DAINAMIC NEWS

సూర్యాపేట జిల్లా బీజేపీ కోశాధికారిగా తాళ్ల నరేందర్ రెడ్డి నియామకం జిల్లా అధ్యక్షుల నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన నరేందర్ రెడ్డి

News Image

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 23




భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కోశాధికారిగా తాళ్ల నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో నేరేడుచర్ల టౌన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనను పార్టీ జిల్లా ట్రెజరర్‌గా బీజేపీ నాయకత్వం నియమించింది.




పార్టీ నాయకత్వానికి నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు




జిల్లా కోశాధికారిగా బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా అధ్యక్షులు చల్లా శ్రీలత రెడ్డి, రాష్ట్ర నాయకత్వానికి తాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తాళ్ల నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.




నిబద్ధతతో సేవలకు వాగ్దానం




తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజాయితీ, నిబద్ధతతో పార్టీ అభివృద్ధికి సేవలు అందిస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన కృషికి అందరి ఆశీర్వాదాలు, సహకారం కొనసాగించాలని కోరుకున్నారు.




పార్టీలో హర్షం




తాళ్ల నరేందర్ రెడ్డి నియామకంతో బీజేపీ కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది.

🏠 Home