🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2025, 6:34 am Posted by : DAINAMIC NEWS

ప్రజావాణి పిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ సీతారామారావు

News Image

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24




జిల్లాలో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణి పిర్యాదులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.




పెండింగ్ పిర్యాదులపై హెచ్చరిక




జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో చాలా కాలంగా పిర్యాదులు పెండింగ్‌లో ఉన్నందున, ప్రతి శాఖ అధికారులు ప్రత్యేక సమయం కేటాయించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. వారం రోజుల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి పిర్యాదు స్థితిని సమీక్షిస్తామని స్పష్టం చేశారు.




కార్మిక భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరణ




భవన నిర్మాణం, ఇతర అవ్యవస్థీకృత రంగ కార్మికుల సంక్షేమార్థం ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ ఇన్సూరెన్స్ పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రమాద మరణానికి ₹10 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి ₹6 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి ₹4 లక్షలు, సహజ మరణానికి ₹2 లక్షలు ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.జిల్లాలో ఇప్పటివరకు 1,35,885 మంది కార్మికులు భీమా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అనంతరం కార్మిక భీమా పెంపు పోస్టర్‌ను ఆవిష్కరించారు.




66 పిర్యాదులు స్వీకరణ




ఈరోజు ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు అందాయి.




భూ సమస్యలు – 25




ఎంపీడీవోలకు – 11




డిడబ్ల్యూ‌ఓకు – 4




ఆర్డీఓలకు – 3




వివిధ శాఖలకు – 23




అన్ని దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి వేగంగా పరిష్కరించాలని సూచించారు.ఆర్డీవో వేణు మాధవ్, డీఆర్‌డీవో అప్పారావు, హౌజింగ్ పీడీ సిద్దార్థ్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరుణ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డిడబ్ల్యూ‌ఓ నరసింహారావు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

🏠 Home