🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 January 2026, 4:55 am Posted by : DAINAMIC NEWS

రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు పౌరులను ప్రభావితం చేయాలి అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ పిలుపు

News Image

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 16




రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘అరైవ్ ఎలైవ్’ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, సూర్యాపేట పట్టణ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది.




రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరం – డీఎస్పీ




ఈ సందర్భంగా సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.




ఉద్యోగులు ప్రజలకు మార్గదర్శకులుగా నిలవాలి




రోడ్డు భద్రత పట్ల సామాన్య ప్రజలు, యువతలో అవగాహన పెంచడంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావవంతంగా వ్యవహరించాలన్నారు.ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని పేర్కొన్నారు.




హెల్మెట్, వేగ నియంత్రణ తప్పనిసరి




ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి,మద్యం సేవించి వాహనాలు నడపరాదని,అతి వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని డీఎస్పీ హెచ్చరించారు.అదేవిధంగా, పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.




రోడ్డు భద్రత ఉద్యమంలా కొనసాగాలి




పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు భద్రత కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగాలన్నారు.ఈ కార్యక్రమాల్లో ఉద్యోగులు, పౌరులు భాగస్వాములుగా మారి సహకరించాలన్నారు.




ప్రమాద రహిత ప్రయాణంపై ప్రతిజ్ఞ




కార్యక్రమం చివరలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ, ప్రమాద రహితంగా వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు.




పాల్గొన్న అధికారులు




ఈ కార్యక్రమంలోడీఎస్పీ ప్రసన్న కుమార్,
ఎంఈఓ శ్రీనివాస్,ఆర్‌ఎంఓ లక్ష్మణ్,
ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం,టౌన్ ఎస్ఐలు మహేంద్రనాథ్, శివతేజ, ఐలయ్య,ఏఎంవీఐ విక్రమ్, ఏఎంవీఐ సంపత్‌తో పాటుమున్సిపల్ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

🏠 Home