🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 January 2026, 3:50 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్లలో బిఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం రామాలయంలో ప్రత్యేక పూజలతో శుభారంభం

News Image

నేరేడుచర్ల , డైనమిక్ న్యూస్, జనవరి 22




నేరేడుచర్ల మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని గురువారం పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఘనంగా ప్రారంభించారు.




బిఆర్ఎస్ సీనియర్ నేతల భారీ పాల్గొనడం




ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్‌ఎన్ రెడ్డి, అప్పిరెడ్డి, శ్రీధర్ బాబు, సురేష్ బాబు, సైదులు, వెంకటరెడ్డి, జయాబాబు పాల్గొన్నారు.అలాగే సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రచారానికి మద్దతు తెలిపారు.




బిఆర్ఎస్ గెలుపు ఖాయం – ఒంటెద్దు నరసింహారెడ్డి




ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ,రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.




కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించాలి




కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు అడగడానికి వస్తే,ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను చూపించాలని ఆయన సూచించారు. వికలాంగుల పింఛన్ పెంపు,ఆడబిడ్డలకు రూ.2500,విద్యార్థులకు స్కూటీ,గ్యాస్ సబ్సిడీ వంటి హామీలను లెక్కిస్తే ఒక్కో కుటుంబానికి రూ.60 వేల వరకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




ప్రశ్నించే పార్టీ బిఆర్ఎస్ – అభివృద్ధికి అదే సరైన ఎంపిక




ప్రజల తరఫున ప్రశ్నించే పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని ఆయన వ్యాఖ్యానించారు.




కేసీఆర్ హయాంలో అభివృద్ధి – కాంగ్రెస్‌లో స్థబ్దత




గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో మున్సిపాలిటీలు గణనీయంగా అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా,మున్సిపాలిటీల పరిస్థితి “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్టుగా ఉందని ఆరోపించారు.

🏠 Home