🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 March 2026, 5:58 am Posted by : DAINAMIC NEWS

కారంపూడి ఏపీ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు బుక్ ఫైల్స్ పంపిణీ

News Image

కారంపూడి, డైనమిక్ న్యూస్ మార్చి 4




కారంపూడి ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి విద్యార్థులకు భారత సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో బుక్ ఫైల్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ సభ్యుడు రవి కిరణ్ విద్యార్థులకు రానున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.




ఆత్మస్థైర్యంతో పరీక్షలను ఎదుర్కోవాలి రవి కుమార్




ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలను ఎదుర్కోవాలని సూచించారు. క్రమం తప్పకుండా బాగా చదివినప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసం వస్తుందని పేర్కొన్నారు.




సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి – రాజేంద్రప్రసాద్




ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చక్ర సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల సమయంలో సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు.ఏ పి జె అబ్దుల్ కలాం మరియు పి వి నరసింహ రావు వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విలువలతో కూడిన విద్యను అభ్యసించి దేశభక్తితో మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.




పాల్గొన్న ప్రముఖులు




ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సుహాసిని, ప్రధానోపాధ్యాయులు శ్రీ రాధాకృష్ణమూర్తి, శ్రీ నాగేశ్వరావు, శ్రీ బాబురావు, ఏపీఎంఎస్ క్లస్టర్ సీఆర్‌పీ వి. చంద్ర మోహన్, పదవ తరగతి అధ్యాపకులు రామకృష్ణ, రవి ప్రసన్న, రాఘవమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.





🏠 Home