🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 March 2026, 3:32 am Posted by : DAINAMIC NEWS

యోగా నిత్యనూతనం – దీర్ఘాయుష్కు యోగమే మెడిసిన్

News Image

మాసాయిపేట్, మార్చి 9, డైనమిక్ న్యూస్




ఆరోగ్యకరమైన జీవనానికి యోగా ఎంతో ఉపయోగకరమని యోగా గురువు తుమ్మ నవీన్ కుమార్ తెలిపారు. మాసాయిపేట్ మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో ప్రతిరోజు ఆయుష్ యోగాసనాల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.




ప్రతిరోజూ యోగా శిక్షణ




గ్రామంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా యోగా టీచర్ తుమ్మ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణలో గ్రామానికి చెందిన చిన్నారులు మరియు యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.




ఆరోగ్య సమస్యలకు యోగానే పరిష్కారం




ఈ సందర్భంగా యోగా మాస్టర్ తుమ్మ నవీన్ కుమార్ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, శారీరక దృఢత్వం పెంపొందించుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.




గ్రామస్తులు పాల్గొనాలని పిలుపు




గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ యోగా సెంటర్‌ను సందర్శించి యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్నం శివరాములు తో పాటు గ్రామ పరిసర ప్రాంతాల చిన్నపిల్లలు పాల్గొన్నారు.

🏠 Home