🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 March 2026, 9:34 pm Posted by : DAINAMIC NEWS

ప్రజల దాహార్తి తీర్చడమే నేరమా?కొత్తపల్లి గ్రామంలో పైప్‌లైన్ మరమ్మత్తుపై వివాదం

News Image

డైనమిక్ న్యూస్, టేక్మాల్ ప్రతినిధి | మార్చి 13




నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో ఇబ్బందులుమెదక్ జిల్లా టేక్మాల్ మండలం కొరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో కొద్ది రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను గ్రామ ప్రజలు సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న వినీత్ కుమార్, ఉప సర్పంచ్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు.




సర్పంచ్ చొరవతో పైప్‌లైన్ మరమ్మత్తు





ప్రజల సమస్యను గుర్తించిన సర్పంచ్, ఉప సర్పంచ్ వెంటనే స్పందించి రోడ్డు తవ్వించి పైప్‌లైన్ మరమ్మత్తు పనులు చేయించారు. దీంతో గ్రామానికి మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరించబడింది. ఈ చర్యతో గ్రామస్థులు ఉపశమనం పొందారు.




అనుమతి లేకుండా తవ్వారంటూ ఫిర్యాదు





అయితే రోడ్డు అనుమతి లేకుండా తవ్వారని ఆరోపిస్తూ కొందరు రాజకీయ ప్రత్యర్థులు ఆర్ అండ్ బి (R&B) అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గ్రామానికి వచ్చిన అధికారులు రోడ్డు అనుమతి లేకుండా తవ్వడం చట్టరీత్యా నేరమని హెచ్చరించినట్లు సమాచారం.




అధికారుల వైఖరిపై గ్రామస్థుల ఆగ్రహం





గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా మాట్లాడారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాల కోసం చేసిన పనిని తప్పుగా చూపడం సరికాదని వారు పేర్కొన్నారు.




రాజకీయ కక్షలతో ఆరోపణలు : సర్పంచ్





గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న వినీత్ కుమార్, ఉప సర్పంచ్ నాగరాజు తెలిపారు. రాజకీయ కక్షలతో తప్పుడు ఫిర్యాదులు చేసి అభివృద్ధి పనులను అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని అన్నారు.జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక ఈ వ్యవహారంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

🏠 Home