🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 April 2026, 11:54 pm Posted by : DAINAMIC NEWS

టేక్మాల్‌లో చలివేంద్రం ప్రారంభంఫోటో ఫన్ సంస్థ సేవలకు ప్రశంసలు

News Image

టేక్మాల్, ఏప్రిల్ 10 డైనమిక్ న్యూస్




వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టేక్మాల్ పట్టణంలో ఫోటో ఫన్ ఫ్లెక్సీ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని టేక్మాల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తిమ్మి సుధాకర్ గురువారం ప్రారంభించారు.




మానవత్వాన్ని చాటిన అన్నదమ్ములు




“అన్ని దానాల కన్నా జలదానం గొప్పది” అనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ ఫోటో ఫన్ సంస్థ నిర్వాహకులు షేక్ మజ్జాహర్, షేక్ బాబా, షేక్ అషీఫ్ ప్రతి ఏడాది వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి కష్టపడి ఎదిగిన వీరు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజా సేవకు వినియోగించడం పట్ల స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.




ప్రజలకు ఊరటగా చలివేంద్రం




మండల కేంద్రమైన టేక్మాల్‌కు నిత్యం వందలాది మంది ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. మండుతున్న ఎండల్లో వీరికి చల్లని నీరు అందించడం ద్వారా ఈ చలివేంద్రం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని స్థానికులు తెలిపారు.




సేవా కార్యక్రమంపై ప్రశంసలు




ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో మజ్జాహర్ సోదరులు చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు.




పాల్గొన్న ప్రముఖులు




ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బత్తుల వీరన్న, మెదక్ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి ఆశల సాగర్, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, టౌన్ ప్రెసిడెంట్ బత్తుల కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.అలాగే మాజీ ఎంపీటీసీ కమ్మరి సిద్దయ్య, వార్డు సభ్యుడు శివయ్య, మాజీ ఉపసర్పంచ్ శివయ్య, కెసి రెడ్డి, సాకలి యాదయ్య, యాదన్న, సోలాపూర్ రాజు, ధనంజయ, కొత్త అరవింద్ తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

🏠 Home