🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 April 2026, 5:37 am Posted by : DAINAMIC NEWS

డ్యూటీలో కానిస్టేబుల్‌పై దాడిఇసుక ట్రాక్టర్ డ్రైవర్ దురాగతం – ముగ్గురిపై కేసు

News Image

మోతే, ఏప్రిల్ 21,శుభోదయ డైనమిక్




మోతే మండలంలో డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ మరియు అతని అనుచరులు దాడి చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.




అక్రమ ఇసుక రవాణా అడ్డుకునే క్రమంలో ఘటన





అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు మోతే ఎస్‌ఐ అజయ్ కుమార్, మండల తహశీల్దార్ సంయుక్తంగా కూడలి గ్రామ శివారులోని వాగు వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటల పాటు పోలీస్ కానిస్టేబుల్, జీపీఓ అధికారి విధులు నిర్వహిస్తున్నారు.




ఆపమంటే ఆగని ట్రాక్టర్





సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కానిస్టేబుల్ కృష్ణం రాజు, జీపీఓ సుధాకర్ విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో కాకరవాయి నుంచి కూడలి వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు.




వెంటాడి ఆపగా దాడి





దీంతో కానిస్టేబుల్ బైక్‌పై వెంటాడి ట్రాక్టర్‌ను ఆపి పత్రాలు కోరగా డ్రైవర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇదే సమయంలో అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కలిసి కానిస్టేబుల్‌పై దాడి చేసి కింద పడవేసి ట్రాక్టర్‌తో పారిపోయారు.




సర్పంచ్ పేరుతో దురుసు ప్రవర్తన





ఘటన సమయంలో వెనుక నుంచి కారులో వచ్చిన ఓ వ్యక్తి తాను సోలిపురం గ్రామ సర్పంచ్ అని చెప్పుకుంటూ ట్రాక్టర్‌ను ఎందుకు ఆపుతున్నావని దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.




ముగ్గురిపై కేసు నమోదు





సమాచారం అందుకున్న ఎస్‌ఐ అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు రాయకుంటా తండాకు చెందిన భూక్యా మధు (డ్రైవర్), భూక్యా శ్రీకాంత్, నునవత్ అశోక్ (సోలిపురం సర్పంచ్)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

🏠 Home