🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 April 2026, 8:08 am Posted by : DAINAMIC NEWS

యంగ్ ఇండియా పాఠశాల పనులపై కలెక్టర్ పర్యవేక్షణత్వరితగతిన నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు

News Image

చిలుకూరు, ఏప్రిల్ 22 ,శుభోదయం డైనమిక్




చిలుకూరు గుట్టల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం పరిశీలించారు.




నిర్మాణ పనులపై సమీక్ష





పాఠశాల పరిధిలో జరుగుతున్న తరగతి గదులు, డార్మెట్రీలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎంట్రన్స్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, త్రాగునీటి సదుపాయాలు, ఆట స్థలాల పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.




నాణ్యత, వేగం రెండూ కీలకం





పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకుండా గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.




ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్ట్





యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే పనులను త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు.ఈ పరిశీలనలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ ధ్రువ కుమార్, గుత్తిదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

🏠 Home