🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 May 2026, 4:53 am Posted by : DAINAMIC NEWS

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యోగ, మారథాన్ కార్యక్రమాలు జిల్లా పరిషత్ హైస్కూల్ నేరేడుచర్లలో ఈ నెల 18, 22 తేదీల్లో నిర్వహణ

News Image

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, మే 17




నేరేడుచర్ల, మే 17: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 మరియు 22 తేదీల్లో యోగ, మెడిటేషన్, మారథాన్‌తో పాటు ప్రజా ప్రదేశాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి తెలిపారు.




ఉదయం 9 గంటలకు ప్రారంభం




జిల్లా పరిషత్ హైస్కూల్ నేరేడుచర్లలో ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. యువతలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, సమాజంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.




ప్రజాప్రతినిధులు, యువత పాల్గొనాలి




ఈ కార్యక్రమాలలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి కోరారు.

🏠 Home