🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 July 2026, 10:54 pm Posted by : DAINAMIC NEWS

డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలఆగస్టు 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం

News Image

హుజూర్‌నగర్, జూలై 26, శుభోదయ డైనమిక్ వార్త




డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆగస్టు 7, 2026లోపు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ తెలిపింది.




డిగ్రీ కోర్సులు




యూనివర్సిటీలో బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సీ. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అలాగే పీజీ స్థాయిలో ఎం.ఏ. (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, సమాజ శాస్త్రం, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్), ఎం.కాం., ఎం.ఎస్‌సీ. వివిధ సబ్జెక్టుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా బి.లైబ్రరీ సైన్స్ (B.L.I.Sc), ఎం.లైబ్రరీ సైన్స్ (M.L.I.Sc), డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు.




అర్హతలు




ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యార్హత కలిగిన వారు డిగ్రీ కోర్సులకు అర్హులు. పదో తరగతి అనంతరం రెండేళ్ల డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ పేర్కొంది.




ఆన్‌లైన్ దరఖాస్తులు – ఆగస్టు 7 వరకు




అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఫీజు చెల్లించేందుకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు. భారతీయ పౌరులెవరైనా తమ అర్హతకు అనుగుణంగా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చని, తెలంగాణ రాష్ట్రంలోని అధ్యయన కేంద్రాన్నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.




పాత బ్యాచ్‌ల విద్యార్థులకు అవకాశం




2021–22 నుంచి 2025–26 బ్యాచ్‌ల డిగ్రీ విద్యార్థులు, అలాగే 2023–24 నుంచి 2025–26 బ్యాచ్‌ల ఫీజులు సకాలంలో చెల్లించని విద్యార్థులు కూడా ఆగస్టు 7లోపు ట్యూషన్ ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించినట్లు యూనివర్సిటీ వెల్లడించింది.




హుజూర్‌నగర్ స్టడీ సెంటర్ వివరాలు




హుజూర్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని BRAOU స్టడీ సెంటర్–199 ద్వారా ప్రవేశాలకు సంబంధించి మార్గదర్శకత్వం అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9502800262ను సంప్రదించవచ్చు. అలాగే www.braouonline.in మరియు www.braou.ac.in వెబ్‌సైట్లలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంది.

🏠 Home