🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 August 2026, 10:27 pm Posted by : DAINAMIC NEWS

మోతే మండలంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సుడిగాలి పర్యటన పలువురి కుటుంబాలను పరామర్శించి.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా

News Image

శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే | ఆగస్టు 25




మోతే మండలంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. హుస్సేనాబాద్ గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ కొమ్ము ఎలమంచమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సిరికొండ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన షేక్ సలీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిఖ్య తండాకు చెందిన జంట హత్యల్లో మృతి చెందిన హలావత్ నాగులు, బూబా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధరావత్ రవీందర్ కుమార్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.




కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి పరామర్శ.. వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే




రాఘవపురం ఎక్స్‌రోడ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బత్తిని లక్ష్మయ్య గౌడ్‌ను ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటనలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పందిల్లపల్లి పుల్లారావు, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాతృ నాయకులు, వెలుగు వీరన్న, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతే ఎస్సై బి. లచ్చిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home