🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 September 2026, 4:25 am Posted by : DAINAMIC NEWS

ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి పోలీస్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుదారులతో మాట్లాడిన ఎస్పీ నరసింహ

News Image

సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 28,శుభోదయ డైనమిక్ వార్త




సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.




ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి




ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు వేగంగా స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. బాధితులకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు.




గొడవలకు దూరంగా ఉండాలి




ప్రజలు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సమస్యలు తలెత్తినప్పుడు దాడులకు పాల్పడకుండా ఇరువర్గాలు పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.




ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది




ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

🏠 Home