🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 10:50 am Posted by : DAINAMIC NEWS

రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్‌ పవార్‌

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 352 కొనుగోలు కేంద్రాలు గుర్తించగా, మొదటి దశలో 267 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు


శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట బ్యూరో


ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 352 కొనుగోలు కేంద్రాలు గుర్తించగా, మొదటి దశలో 267 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, తేమ మీటర్లు, గన్నీ సంచులు, టార్పాలిన్లు, హమాలీలు తదితర సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, రవాణా వాహనాలను జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు.కొనుగోలు వివరాలను ఓపీఎంఎస్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి. హరి సింగ్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు
🏠 Home