🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 10:59 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలి ;మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు

News Image
ముఖ్యమైన పాయింట్స్:భూగర్భ జలాల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలిఅవసరం మేరకే తాగునీటి వినియోగంప్రతి ఇంటా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి
నేరేడుచర్ల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలి

భూగర్భ జలాల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

శుబోదయ డైనమిక్ న్యూస్ ,నేరేడుచర్ల

నేరేడుచర్ల పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు కోరారు. వర్షపాతం తగ్గడం, ఎండల తీవ్రత పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

అవసరం మేరకే తాగునీటి వినియోగం

మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటి నల్లాకు తప్పనిసరిగా ట్యాపులు బిగించుకోవాలని, నీటిని వృథాగా రోడ్లపైకి, కాలువల్లోకి వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

నీటి వృథాపై కఠిన చర్యలు

ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే భవిష్యత్‌లో మున్సిపాలిటీ తరఫున కఠినమైన ఆంక్షలు, చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రతి ఇంటా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి

పట్టణ ప్రజలు నీటి సంరక్షణలో మున్సిపల్ యంత్రాంగానికి సహకరించడంతో పాటు ప్రతి ఇంటి వద్ద వర్షపు నీటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి నీటి బొట్టును కాపాడితేనే భావితరాలకు నీటి భద్రత కల్పించగలమని కమిషనర్ నాగరాజు పేర్కొన్నారు.
🏠 Home