రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ముఖ్యమైన పాయింట్స్:కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కుషాయిగూడ, అక్టోబర్ 4 శుభోదయ డైనమిక్
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.బోడుప్పల్‌కు చెందిన కన్నారపు శ్రవణ్ (29) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని నాగార్జున నగర్‌లోని తన సహోద్యోగి ఇంటికి వెళ్లిన శ్రవణ్, అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:35 గంటలకు తన Activa (TS27U4867)పై అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రవణ్‌ను స్థానికులు ఈసీఐఎల్‌లోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు