🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 12:14 am Posted by : DAINAMIC NEWS

జర్నలిస్టులు, అడ్వకేట్లపై పోలీసుల వరుస విజయం..!

News Image
ముఖ్యమైన పాయింట్స్:గంజాయి నిర్మూలనకు మద్దతుగా నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో పోలీసులు సత్తా చాటారు


శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్: గంజాయి నిర్మూలనకు మద్దతుగా నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో పోలీసులు సత్తా చాటారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అడ్వకేట్లు, పోలీసుల మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో జర్నలిస్టుల జట్టుపై, అనంతరం అడ్వకేట్ల జట్టుపై పోలీసులు విజయం సాధించి వరుసగా రెండు విజయాలను నమోదు చేశారు.హుజూర్‌నగర్ పట్టణంలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో జర్నలిస్టులు–పోలీసుల జట్లు తలపడగా పోలీసుల జట్టు విజయం సాధించింది. అనంతరం అడ్వకేట్లు–పోలీసుల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పోలీసులు గెలుపొందారు. దీంతో రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పోలీసులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు మాట్లాడుతూ.. క్రీడలతో వివిధ వర్గాల మధ్య స్నేహభావం, ఐక్యత పెంపొందుతాయని అన్నారు. క్రీడా పోటీలు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు పరస్పర స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.కాగా, ఫ్రెండ్లీ క్రీడా పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని సీఐ చరమంద రాజు శనివారం ఆవిష్కరించారు. జర్నలిస్టులు, అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో పేర్లు నమోదు చేసుకొని క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు.కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఎస్‌ఐ నరేష్, టోర్నమెంట్ కన్వీనర్ మోర్తాల నాగిరెడ్డి, జర్నలిస్టులు కోలా నాగేశ్వరరావు, దుగ్గి ఉషశ్రీ, దొంతగాని రాజా రమేష్, షేక్ జానీ పాషా, నక్క నరేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home