🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 12:22 am Posted by : DAINAMIC NEWS

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ సాధించుకుంటాం

News Image
ముఖ్యమైన పాయింట్స్:బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు

హైదరాబాద్, అక్టోబర్ 5, శుభోదయ డైనమిక్


చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ సాధించి తీరుతామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావని, ఇది తమ హక్కు అని పేర్కొన్నారు.ఆదివారం నారాయణగూడలోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి హైదరాబాద్ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అస్తిత్వ, ప్రజా ఉద్యమాలు విజయవంతమవుతాయని, ప్రజా ఉద్యమాలు ఎన్నడూ విఫలం కాలేదని చరిత్ర చెబుతోందన్నారు.బీసీల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని, జనాభాలో 10 శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినప్పుడు బీసీలు ప్రశ్నించలేదన్నారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్వాతంత్ర్య ఫలాలు అందరికీ సమానంగా అందేలా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కమతం యాదగిరి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా బీసీలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలంటే రాజకీయ రిజర్వేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. బీసీల్లో చైతన్యం పెరుగుతున్నప్పటికీ అది మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్య ఉద్యమాలతో బీసీలు తమ హక్కులను సాధించుకోవాలని, అందుకు బీసీ హక్కుల సాధన సమితి కృషి చేస్తోందన్నారు. మహాసభకు బాలయ్య యాదవ్ అధ్యక్షత వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్, గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మారగోని ప్రవీణ్ గౌడ్, ఎన్.ఆర్. శ్రీనివాసరావు, సీ. శంకర్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home