రైతాంగానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలి రేపాల సబ్‌స్టేషన్ వద్ద రైతు సంఘం ఆందోళన
ముఖ్యమైన పాయింట్స్:రైతాంగానికి సరిపడా కరెంట్ ఇవ్వాలిఎండిపోతున్న వరి పంటలను కాపాడాలిరేపాల సబ్‌స్టేషన్ వద్ద రైతు సంఘం ఆందోళన
శుభోదయ డైనమిక్ న్యూస్ – మునగాల, అక్టోబర్ 8
ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు రైతాంగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నరసింహులగూడెం గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో రేపాల సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బోరుబావుల ద్వారా పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు సరిపడా విద్యుత్ అందక మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన స్థాయిలో విద్యుత్ ఎందుకు సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు.రేపాల సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో లోవోల్టేజ్, అనధికారిక విద్యుత్ కోతలతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు పొలాల వద్దే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలకు సైతం తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.లోవోల్టేజ్ సమస్య ఇలాగే కొనసాగితే పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని, పరిస్థితి మరింత విషమిస్తే రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రేపాల సబ్‌స్టేషన్ పరిధిలో లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించి, నిరంతరాయంగా సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నరసింహులగూడెం గ్రామానికి ప్రత్యేకంగా లైన్‌మెన్‌ను నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మొగిలిచెర్ల సీతారాములు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొంత స్వరూప, విజయలక్ష్మి, కొండారెడ్డి, వార్డు సభ్యులు రమేష్, శివరాజు, ఖాసిం అలీ, నాగరాజు, రవీందర్‌రెడ్డి, అలాగే సోమయ్య, బ్రహ్మం, వేణుగోపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంబాబు, మదార్ తదితర రైతులు పాల్గొన్నారు.