🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 6:50 am Posted by : DAINAMIC NEWS

ప్రభుత్వ చేయూతతో విద్యార్థులు ప్రయోజకులు కావాలి: డీఐఈఓ

News Image
ముఖ్యమైన పాయింట్స్:ప్రభుత్వ చేయూతతో విద్యార్థులు ప్రయోజకులు కావాలి: డీఐఈఓ
ప్రభుత్వ చేయూతతో విద్యార్థులు ప్రయోజకులు కావాలి: డీఐఈఓ

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 9

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బ్యాగులు, బెల్టులు, ఐడీ కార్డులు, షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి బి. సులోచన రాణి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి. నీరజ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

🏠 Home