ఎల్‌నినో ప్రభావం ఉన్నా నీటి వృథా ఎలా? ప్రజలకు పొదుపు సూచనలు.. అధికారుల కళ్ల ముందే వారం రోజులుగా పైప్‌లైన్ లీకేజీ!
ముఖ్యమైన పాయింట్స్:ఎల్‌నినో ప్రభావం ఉన్నా నీటి వృథా ఎలా?ప్రజలకు పొదుపు సూచనలు.. అధికారుల కళ్ల ముందే వారం రోజులుగా పైప్‌లైన్ లీకేజీ!
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ న్యూస్
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ప్రతి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. భూగర్భ జలాలను పరిరక్షించాలని, తాగునీటిని వృథా చేయవద్దని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు సైతం పిలుపునిచ్చారు. అయితే మరోవైపు నేరేడుచర్ల పట్టణంలో అధికారుల కళ్ల ముందే గత వారం రోజులుగా తాగునీరు వృథాగా పోతుండటం చర్చనీయాంశంగా మారింది.
పైప్‌లైన్ లీకేజీ.. నీరు ఎన్‌ఎస్పీ కాలువలోకి
నేరేడుచర్ల పట్టణంలోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల ప్రధాన రహదారి పక్కన, ఎంఈఓ కార్యాలయానికి వెళ్లే మార్గంలో తాగునీటి పైప్‌లైన్ పగిలి నీరు లీకవుతోంది. పక్కనే ఉన్న ఎన్‌ఎస్పీ కాలువలోకి లీకేజీ నీటిని మళ్లించిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో విలువైన నీరు కాలువలోకి చేరుతూ వృథాగా పోతోంది.
ఇదే రోడ్డులో అధికారుల నిత్య రాకపోకలు
ఈ పైప్‌లైన్ ఉన్న మార్గంలోనే ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, మిషన్ భగీరథ ఏఈతో పాటు మున్సిపల్ అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మరి వారం రోజులుగా నీరు లీకవుతున్న విషయం వారికి కనిపించలేదా? కనిపించినా సంబంధిత శాఖ పరిధిలోది కాదని భావించి పట్టించుకోలేదా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
“మాది కాదులే” అంటూ వదిలేశారా?
ప్రజలకు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించే అధికారులు.. తమ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన మార్గంలోనే నీరు వృథాగా పోతుంటే ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. “మాది కాదులే.. సంబంధిత శాఖ చూసుకుంటుంది” అని ఎవరికివారు వదిలేశారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు ఒక న్యాయం.. అధికారులకు మరో న్యాయమా?
ఒకవైపు నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచనలు చేస్తూ, మరోవైపు ప్రభుత్వ శాఖల అధికారుల నిత్య రాకపోకల మధ్యే తాగునీరు వృథాగా పోతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును కాపాడాల్సిన సమయంలో ఇలా వృథాగా పోతున్న నీటిపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.
వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలి
సంబంధిత అధికారులు సమన్వయంతో స్పందించి పగిలిన పైప్‌లైన్‌ను వెంటనే మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న నీటి వృథాపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ నాగరాజు ను ఫోన్ లో వివరణ కోరగా :
ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు కాబట్టి వెంటనే సిబ్బందిని పంపించి వాటర్ లికేజి కాకుండా చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. ప్రజలకు ఒక విజ్ఞప్తి మున్సిపల్ పరిధిలోని ఇంకా ఎక్కడైనా లికేజి ఉంటే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని కోరారు