🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 3:25 pm Posted by : DAINAMIC NEWS

చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స మరో రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేత పాప చదువు బాధ్యత నాదే.. తల్లిదండ్రులకు మంత్రి భరోసా

News Image
ముఖ్యమైన పాయింట్స్:చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్సమరో రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేతపాప చదువు బాధ్యత నాదే.. తల్లిదండ్రులకు మంత్రి భరోసా
చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స

మరో రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేత

పాప చదువు బాధ్యత నాదే.. తల్లిదండ్రులకు మంత్రి భరోసా

హైదరాబాద్, అక్టోబర్ 10, శుభోదయ డైనమిక్ వార్త:

మూగ, చెవిటి దంపతుల చిన్నారికి అండగా నిలిచి, మెరుగైన వైద్య చికిత్స అందేలా కృషి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది.శస్త్రచికిత్స అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇప్పటికే కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందించిన మంత్రి, తాజాగా మరో రూ.2 లక్షలను అందజేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం రూ.4 లక్షల ఆర్థికసాయం అందించినట్లయింది.వైద్యుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు స్పీచ్ థెరపీ అందిస్తే చిన్నారి త్వరలోనే మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. పాప సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, భవిష్యత్తులో చిన్నారి చదువు బాధ్యతను కూడా తానే తీసుకుంటానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థికసాయంతో పాటు భవిష్యత్తుపై భరోసా కల్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

🏠 Home