🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 3:37 pm Posted by : DAINAMIC NEWS

ఎల్ నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఎల్ నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో,అక్టోబర్ 10, శుభోదయ డైనమిక్,

రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో తాగునీరు, వ్యవసాయం, పశుగ్రాసం తదితర రంగాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వచ్చే జూలై వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మూడు నెలల ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.రైతులు, కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలని, వర్షపు నీటి సంరక్షణ, చెరువులు, బావులు, బోర్ల రీఛార్జ్ పనులు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో 16 మండలాల్లో భూగర్భ జలాలు సరాసరి కంటే తక్కువగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం రెండు మీటర్లు తగ్గిందని అధికారులు వివరించారు. తాగునీరు, పంటలు, పశుగ్రాసం పరిస్థితులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
🏠 Home