స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లపల్లి శివకృష్ణ
ముఖ్యమైన పాయింట్స్:స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లపల్లి శివకృష్ణ
స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లపల్లి శివకృష్ణ
కోదాడ,శుభోదయ డైనమిక్ వార్త
సూర్యాపేట జిల్లా స్వేరోస్ ప్రధాన కార్యదర్శిగా మోతె మండలానికి చెందిన యువ నాయకుడు జిల్లపల్లి శివకృష్ణ నియమితులయ్యారు.కోదాడలో నిర్వహించిన స్వేరోస్ జిల్లా కమిటీ పునర్నిర్మాణ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు చెరుకుపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివకృష్ణకు జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.నియామకంపై శివకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్వేరోస్ వ్యవస్థాపకుడు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆశయాలను, బహుజన రాజ్యాధికార స్ఫూర్తిని గ్రామగ్రామానికీ తీసుకెళ్తానన్నారు. పేద, బహుజన విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తూ జిల్లాలో స్వేరోస్‌ను మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. తనకు అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు పిడమర్తి దశరథ, సీనియర్ నాయకులు చెడపంగు రవికుమార్, చెడపంగు నాగార్జున, అధికార ప్రతినిధి విజయనిర్మల, ఉపాధ్యక్షులు జ్యోతి రాణి, సునీత, పాముల రాకేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.