🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 12:21 pm Posted by : DAINAMIC NEWS

సర్వారంలో కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు

News Image
ముఖ్యమైన పాయింట్స్:సర్వారంలో కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన పూజలుపాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు
శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతె, అక్టోబర్ 11

సూర్యాపేట జిల్లా మోతె మండలం సర్వారం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూడు నగేష్, ఉపసర్పంచ్ మల్సూర్, గ్రామ పెద్దలు మిక్కిలినేని పురుషోత్తమరావు, వీరబోయిన మల్లయ్య, వార్డు సభ్యులు బయ్యా వెంకన్న, వెంకన్న, కమిటీ సభ్యులు మహేందర్, సతీష్, మధుబాబు, రామకృష్ణ, నరేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

🏠 Home