🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 1:37 pm Posted by : DAINAMIC NEWS

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం సహకారం ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్‌కు ప్రధాని మోదీ హామీ

News Image
ముఖ్యమైన పాయింట్స్:మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం సహకారంముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్‌కు ప్రధాని మోదీ హామీ

శుభోదయ డైనమిక్ న్యూస్ | జాతీయ వార్తలు | అక్టోబర్ 11

న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం న్యూఢిల్లీలో మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ప్రధానిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.రాష్ట్రంలో శాంతి స్థాపనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. ప్రజా రవాణా సేవల పునరుద్ధరణ, జాతీయ రహదారులపై సరకు రవాణా సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వివిధ వర్గాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలియజేశారు.కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని, ఇంఫాల్‌లోని ప్రాంతీయ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS)ను ఎయిమ్స్ స్థాయికి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని గుర్తించారని, మణిపూర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన అంశాలపై సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, మణిపూర్‌లోని పలు కొండ ప్రాంతాల్లో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల్లో తొమ్మిది మంది మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

🏠 Home