🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 2:38 pm Posted by : DAINAMIC NEWS

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలిసిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన

శుభోదయ డైనమిక్ న్యూస్ – నల్గొండ బ్యూరో,అక్టోబర్ 11

ప్రజల ఓటు హక్కును హరిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హషం డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు వెళ్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆదివారం నల్గొండ పట్టణంలోని పెద్దబండ సెంటర్‌లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ హషం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్‌ విధానం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సామాన్యులు, దళితులు, మైనారిటీల ఓట్ల తొలగింపునకు గురవుతున్నారని ఆరోపించారు.పత్రాల్లో పేర్లలో తప్పులు, సాంకేతిక కారణాలతో నోటీసులు జారీ చేసి ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పూర్వీకుల జనన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కోరడం సామాన్యులకు కష్టతరంగా మారుతుందని పేర్కొన్నారు.ఎన్నికల విధానాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సిపిఎం, ఇతర ప్రజా సంఘాలు ఆందోళన చేపడుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ, అవుట రవీందర్, అద్దంకి నరసింహ, సాలివోజు సైదాచారి, గంజి రాజేష్, మన్నె శంకరయ్య, గడగోజు శ్రీనివాసచారి, తెలకపల్లి శ్రీనివాస్, చింతకాయల సంతోష్, పాక పరమేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

🏠 Home