టైలర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా మరోసారి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక దర్జీ వృత్తిదారులకు ప్రభుత్వం అండగా నిలవాలి
ముఖ్యమైన పాయింట్స్:టైలర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా మరోసారి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికదర్జీ వృత్తిదారులకు ప్రభుత్వం అండగా నిలవాలి
శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, అక్టోబర్ 11
నేరేడుచర్ల పట్టణ టైలర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం నేరేడుచర్లలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రెడీమేడ్ దుస్తుల వినియోగం పెరగడంతో సంప్రదాయ దర్జీ వృత్తి క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దర్జీ వృత్తిదారులకు రుణ సదుపాయాలు కల్పిస్తే స్థానికంగానే రెడీమేడ్ గార్మెంట్స్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు.ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తే పల్లెల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ వంటి నగరాల్లో జీవన వ్యయం అధికంగా ఉండటంతో తక్కువ కూలి రేట్లతో కుటుంబాలను పోషించడం, పిల్లలకు విద్య అందించడం కష్టంగా మారుతోందన్నారు. ప్రజాప్రతినిధులు, పాలకులు దర్జీ వృత్తిదారుల సమస్యలను గుర్తించి వారికి అండగా నిలవాలని కోరారు.యూనియన్ నూతన కార్యవర్గం:
పట్టణ ఉపాధ్యక్షుడిగా బత్తిని అంజయ్య ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కనకయ్య, లక్ష్మయ్య, కీర్తి వెంకన్న, బాల సైదా, అబ్దుల్, కామ్రేడ్ వెంకన్న, రఫీ, ప్రసాద్ వెంకన్న, గణేష్, సీహెచ్ శ్రీను, సుజాత ఎన్నికయ్యారు.