🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 October 2026, 10:50 am Posted by : DAINAMIC NEWS

గరిడేపల్లిలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం అక్టోబర్ 14న మండల స్థాయి భేటీ.. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి: కుక్కడపు మహేష్

News Image
ముఖ్యమైన పాయింట్స్:గరిడేపల్లిలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశంఅక్టోబర్ 14న మండల స్థాయి భేటీ.. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి: కుక్కడపు మహేష్
శుభోధయ డైనమిక్ వార్త, హుజూర్ నగర్, అక్టోబర్ 12

మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అక్టోబర్ 14న గరిడేపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు హుజూర్‌నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ తెలిపారు.ఈ సమావేశంలో మండల పరిధిలోని యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ కార్యక్రమాలు, యువజన కాంగ్రెస్ కార్యకలాపాలపై చర్చించాలని ఆయన కోరారు. మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, యువజన నాయకుల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.కావున యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కుక్కడపు మహేష్ విజ్ఞప్తి చేశారు.
🏠 Home