🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 2:32 pm Posted by : DAINAMIC NEWS

హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

News Image
ముఖ్యమైన పాయింట్స్:హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదంబస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

హుజూర్‌నగర్, అక్టోబర్ 13 – శుభోదయ డైనమిక్ న్యూస్:

హుజూర్‌నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిక్షా కార్మికుడు రమణయ్య (70) మృతి చెందారు. రోజువారీ పనిలో భాగంగా రిక్షాపై ఉల్లిగడ్డల బస్తా తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.హుజూర్‌నగర్‌కు చెందిన రమణయ్య రోడ్డు దాటుతుండగా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ పాఠశాలకు చెందిన బస్సు ఆయన రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణయ్య అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

🏠 Home