🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 9:02 am Posted by : DAINAMIC NEWS

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవతో విద్యుత్ సమస్యకు పరిష్కారం నడిగూడెం సబ్‌స్టేషన్‌కు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు సమస్యను మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీ

News Image
ముఖ్యమైన పాయింట్స్:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవతో విద్యుత్ సమస్యకు పరిష్కారంనడిగూడెం సబ్‌స్టేషన్‌కు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుసమస్యను మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్


నడిగూడెం, అక్టోబర్ 13 (శుభోదయ డైనమిక్ వార్త):

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవతో నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 8 ఎంవీఏ సామర్థ్యం గల పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో నడిగూడెం మండలంలోని రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ సమస్యను కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి, ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య వివరాలను తెలుసుకున్నారు. వెంటనే 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలో మంగళవారం నూతన 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతో మండలంలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులను మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దొన్నా శ్రీనివాసులు, ఉపసర్పంచ్ ఎలుగురి నాగరాజు, వార్డు సభ్యులు దున్న శ్రీకాంత్, దున్న లింగయ్య, నాగవరపు సరస్వతి, రాము, గుండు మహేందర్, కాసాని మాధవి, గోపినాథ్, నాజియా, రియాజ్ పాల్గొన్నారు.అలాగే నాయకులు కాసాని వెంకన్న, గుండు శ్రీనివాస్, రుణబోతు శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, పందిరి శ్రీనివాస్ రెడ్డి, తంగెళ్ల లింగయ్య, దనచారి విజయ్ గోపాల్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులు జి.వి. గణేష్, ఏ. శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, గురుస్వామి, శేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home