🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 2:12 pm Posted by : DAINAMIC NEWS

ఆర్టీఐ అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు ఎస్పీ నరసింహ అభినందనలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఆర్టీఐ అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా సూర్యాపేటజిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు ఎస్పీ నరసింహ అభినందనలు

సూర్యాపేట, శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 14

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సూర్యాపేట గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా యంత్రాంగం కనబరిచిన ప్రతిభకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. కలెక్టర్ నాయకత్వంలో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు.ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడం, ప్రభుత్వ శాఖల పనితీరులో పారదర్శకతను పెంపొందించడం, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడంలో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనలో జిల్లా యంత్రాంగం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

🏠 Home