ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తో నకిలీ మద్యం నిర్మూలనప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే. శ్రీనివాస్
డైనమిక్, నరసరావుపేట పల్నాడు జిల్లాలో నకిలీ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే. శ్రీనివాస్ తెలిపారు. నరసరావుపేటలోని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నకిలీ మద్యం గుర్తించే విధానాలు, యాప్ వినియోగం, ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు వంటి వివరాలను వెల్లడించారు. నకిలీ మద్యం గుర్తించడం ఎలా అంటే… మద్యం సీసాపై సీల్ హోలోగ్రామ్, బార్‌కోడ్ ఉంటాయి. వీటిని స్కాన్ చేస్తే ఎప్పుడు, ఎక్కడ తయారైంది, ఎటు నుంచి వచ్చింది, ఏ దుకాణానికి సరఫరా అయింది...