ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరిక
డైనమిక్,సూర్యాపేట బ్యూరో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో ఎలాంటి లోపాలు లేకుండా, అన్ని కేంద్రాలు సమగ్రంగా సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టంగా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలన గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరం నుండి జిల్లా అంతటా ఉన్న తాసిల్దార్లు, ఎంపీడీవో, ఆర్డీవో, ఏపీఎం, సీఈఓలతో 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజులలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రధాన సూచనలు...