కల్తీ కాలనాగు – ప్రకృతి మాత కడుపులో పెరుగుతున్న ప్రమాదం

– రచన: మంజుల పత్తిపాటి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా మనిషి అభివృద్ధి కోసం అడుగులు వేస్తూ ప్రకృతిని నెమ్మదిగా కాలనాగు చెంతకి నెట్టేస్తున్నాడా? ఈ ప్రశ్న ఈ కాలానికి ప్రతిధ్వనిలా మారింది. కల్తీ మందులు, రసాయన ఎరువులు, ప్లాస్టిక్ వాడకం – ఇవన్నీ మనం రోజువారీ జీవన భాగంగా మార్చుకున్నాం. కానీ అదే మన పంటలలో, మన ఆహారంలో, చివరికి మన రక్తంలోనూ కలిసిపోయి “కల్తీ కాలనాగు”గా రూపం దిద్దుకుంటోందని ఈ రచన ఆవేదనతో చెబుతోంది. కల్తీ పంటలతో పెరుగుతున్న కల్తీ కాలం రైతు తన భూమిలో పంటలు పండిస్తున్నాడే కానీ, ఆ పంటలు సహజసిద్ధమైనవి కావు....