ప్రభుత్వ పాఠశాలల్లో పోటీ పరీక్షల స్థాయిలో బోధన ఉండాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
డైనమిక్,సూర్యాపేట బ్యూరో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే స్థాయిలో బోధన జరగాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు (ఎంఈఓలు), హెడ్‌మాస్టర్లు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లతో కలెక్టర్ విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ నెల 24 నుండి జరగనున్న సమ్మేటివ్ పరీక్షలపై పూర్తి దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు.వార్షిక పరీక్షలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.ప్రతి పాఠశాలలో విద్యార్థుల...