పెయ్యిదూడల పుట్టుకకు లింగ నిర్ధారిత వీర్యం వినియోగంపై అవగాహన నూజెండ్లలో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం

వినుకొండ, నూజెండ్ల, డైనమిక్ అక్టోబర్ 17 పాడిపశువుల్లో పెయ్యిదూడల పుట్టుకకు లింగ నిర్ధారిత వీర్యం వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే పశువుల్లో గర్భకోశ వ్యాధుల నివారణకు ఉద్దేశించి నూజెండ్ల మండలం ముక్కెల్లపాడు గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. వినుకొండ ప్రాంత పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ నెలవల్లి శ్రీరాములు ఆధ్వర్యంలో, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ సహకారంతో, రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్ద సింగంశెట్టి వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ పి. రామారావు, సంయుక్త సంచాలకుడు డాక్టర్ టి.వి. సుధాకర్, గుంటూరు జిల్లా కార్యనిర్వహణ అధికారి...