సముద్రతీరంలో పటిష్టమైన భద్రతా చర్యలు– జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

డైనమిక్,బాపట్ల మద్యం సేవించి ఎవరూ కూడా సముద్రంలోకి దిగడానికి వీలులేదని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ హాలులో బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లా ప్రధానమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. పిడుగురాళ్ల నుండి వాడరేవు వరకు నిర్మిస్తున్న 167A జాతీయ రహదారి పనులు త్వరలోనే పూర్తికానున్నాయని తెలిపారు. ఆ రహదారి అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు...