నేటి సాయంత్రం కు ఏపీలో ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఓ ప్రకటన విడుదలకు రంగం
ఏపీ బ్యూరో , అక్టోబర్ 18 ఏపీలో ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఓ ప్రకటన విడుదలకు రంగం సిద్దమవుతోంది. గతంలో కేబినెట్ భేటీ సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని భావించినా చివరి నిమిషంలో వాయిదా పడిపోయింది. దీంతో దీపావళి కానుకగా నేడు ఈ ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆర్థికశాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ విజయానంద్ తుది చర్చలు జరుపుతున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయబోతున్నారు.రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా గత వైసీపీ సర్కార్ తరహాలోనే ఉద్యోగుల బకాయిలు అలాగే ఉన్నాయి. వీటితో పాటు పీఆర్సీ ప్రకటన, కమిషనర్ నియామకం, ఇతర ఆర్ధిక ప్రయోజనాలు,...