కొనసాగుతోన్న బంద్… తెలంగాణ స్తంభించినట్టే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోరుతూ బీసీ సంఘాల సమాఖ్య బంద్ పిలుపు – రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి
డైనమిక్ ,హైదరాబాద్, అక్టోబర్ 18 తెలంగాణ రాష్ట్రం శనివారం ఉదయం నుంచి బీసీ సంఘాల బంద్‌తో స్తంభించినట్టయింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల సమాఖ్య పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ సేవలు పూర్తిగా నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపోల వద్ద బస్సుల నిరోధం తెలంగాణలోని దాదాపు అన్ని ఆర్టీసీ డిపోల వద్ద బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.హైదరాబాద్, తెలంగాణా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులు బయటకు రాకుండా బంద్ పాటించారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ పార్టీల నాయకులు నాయకులు, కార్యకర్తలతో కలిసి బంద్‌లో...