అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు…

18 నెలల జ్వాయన్ కు ఎస్ఎంఏ సమస్య… మంగళగిరి సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ 4 లక్ష రూపాయలు అందజేత… ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి… డైనమిక్,మంగళగిరి, మంగళగిరి పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో నాలుగు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మూడున్నర లక్షల రూపాయలు వసూలు చేయగా, స్కూల్ యాజమాన్యం 50 వేల రూపాయలు కలిపి నాలుగు లక్షల రూపాయల చెక్కును షేక్ యాసిన్ కు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కెవి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయురాలు దసరా సెలవులు సందర్భంగా...