కొండమల్లెపల్లిలో దారుణం… ఇద్దరు చిన్నారులను హతమార్చి తల్లి ఆత్మహత్య

కొండమల్లెపల్లి ,డైనమిక్, అక్టోబర్ 20 నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలంలో  మానసిక కలతతో ఓ తల్లి చేసిన దారుణం విషాదం నింపింది. ఇద్దరు చిన్నారులను హతమార్చి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది. తెల్లవారుజామున ఘోరం సోమవారం తెల్లవారుజామున కొండమల్లెపల్లిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ స్పందించకపోవడంతో పొరుగువారు వెళ్లి చూడగా ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు మృతులది స్వగ్రామం బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే కారణమా?...