నల్లగొండ జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులు
డైనమిక్,నల్లగొండ బ్యూరో , అక్టోబర్ 21 శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకొని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు స్తూపం వద్ద పుష్పగుచ్చాలు అర్పించి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పోలీస్ శాఖ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజారక్షణకు త్యాగాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన పరిష్కారాలను అందిస్తున్నదని తెలిపారు. ప్రాణ త్యాగాలతో పాటు ఎటువంటి...