నల్లగొండ జిల్లా మున్సిపల్ ప్రాంతాల్లో తాత్కాలిక కార్మికులకు జీవిత భీమా తప్పనిసరి: జిల్లా కలెక్టర్
డైనమిక్ ,నల్లగొండ బ్యూరో ,అక్టోబర్21 ఈ నెలాఖరుకల్లా జిల్లాలోని అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో తాత్కాలిక పనులు చేసుకునే వారందరికీ జీవిత భీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు.మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో కనీసం నాలుగు వేల మంది తాత్కాలిక కార్మికులకు జీవిత భీమా సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా పనులు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల వరకు వివిధ రకాల భీమా సౌకర్యాలు అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. అమెజాన్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, స్వల్పకాలిక కార్మికులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని...