వృద్దురాలి హత్య కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్ట్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 22 హుజూర్నగర్ పోలీసులు దర్యాప్తుతో నిందితుల బృందం బట్టబయలు రూ.3.60 లక్షల విలువైన బంగారం, రెండు ఫోన్లు స్వాధీనం హత్య, దొంగతనంగా మారిన అనుమానాస్పద మరణం హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఇల్లు గల చెన్న అనసూర్యమ్మ (వయస్సు 60 ఏళ్లు) ఈ నెల 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శరీరంపై గాయాలు కనిపించడంతో హత్య అనుమానం వ్యక్తమైంది.మృతురాలి పెద్ద కుమారుడు చెన్న వేణు వగ్మూలం, సాంకేతిక ఆధారాల సేకరణ అనంతరం కేసును హత్య, దొంగతనం కేసుగా నమోదు చేశారు పరిచయం పేరుతో దారుణం హుజూర్నగర్...